ప్రేమ వ్యవహారంలో యువకుడిపై దాడి - 11 మంది అరెస్ట్
- VOICE OF HERALD

- 2 days ago
- 1 min read
ప్రేమ వ్యవహారంలో యువకుడిపై దాడి - 11 మంది అరెస్ట్


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మలమడుగు రోడ్డులో గల స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ వద్ద 13వ తేదీన లోకేశ్వర్ రెడ్డి అనే యువకుడిపై ప్రేమ వ్యవహారం విషయంలో కొంతమంది యువకులు బీర్ బాటిళ్, రాళ్లతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను పరిశీలించి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు యువకులు తప్ప మిగిలిన వారందరూ విద్యార్థులే కావటం విశేషం. వీరిలో CBIT మరియు SRIT ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. అరెస్టైన వారి వద్ద నుండి దాడికి ఉపయోగించిన ఇటుక రాళ్లు, కట్టెలు, బీర్ బాటిళ్లు మరియు 3 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలంలో గంజాయి తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. నిందితులను తదుపరి చట్టపరమైన ప్రక్రియ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
తల్లిదండ్రులకు పోలీసుల సూచనలు
ఈ సందర్భంగా సీఐ నాగ భూషణ్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, దైనందిన కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లలు మద్యం, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారా అని గమనించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పిల్లల ప్రవర్తనలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కౌన్సిలింగ్ చేయించాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు, వివాదాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




Comments