top of page

ఎస్వీడిసీ అటానమస్ కాలేజీ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 1 day ago
  • 1 min read

ఎస్వీడిసీ అటానమస్ కాలేజీ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం నందు గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల అటానమస్ కాలేజీ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. కళాశాల కరస్పాండెంట్ వేముల హరి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాడు స్వతంత్రం కోసం వీరుల త్యాగ ఫలితాలను గుర్తు చేస్తూ, స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ, ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని ఐకమత్యంతో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తిని చాటుకోవడం జరిగింది .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శారద భవాని, డైరెక్టర్ పృధ్వి నారాయణ, కోఆర్డినేటర్ గౌరీ శంకర్, ఎం రామ్మోహన్, మౌనయ్య, రెడ్డమ్మ, గంగాభవాని, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page