top of page

శ్రీవిద్య జూనియర్ కళాశాలలో ఘనంగా "ఫ్రెషర్స్ డే" వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 3 days ago
  • 1 min read

శ్రీవిద్య జూనియర్ కళాశాలలో ఘనంగా "ఫ్రెషర్స్ డే" వేడుకలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు, విద్యారంగంలో 32 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రొద్దుటూరు శ్రీవిద్య జూనియర్ కళాశాల ఈ విద్యా సంవత్సరం కొత్తగా చేరిన విద్యార్థుల కోసం "ఫ్రెషర్స్ డే" వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించింది. శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు బొల్లవరంలోని ఎన్ కన్వెన్షన్ నందు ఈ వేడుకలు నిర్వహించారు. ఫన్, ఫ్రెండ్స్, మెమోరీస్ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లకు స్వాగతం పలుకగా, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలతో రోజంతా సందడి చేశారు.

ఈ వేడుకలకు టీచర్స్ యూనియన్ జేఏసీ గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, ప్రొద్దుటూరు మూడవ పట్టణ పోలీస్ ఎస్సై మహమ్మద్, నాగార్జున హాస్పిటల్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఎన్. నాగార్జున, గౌతమి విద్యాసంస్థల అధినేత నాగూర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. వీరి సమక్షంలో వారి చేతుల మీదుగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 994 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలిచిన విద్యార్థికి ఐదువేల రూపాయలు ప్రోత్సాహక నగదు బహుమతితో పాటు పలువురు విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు, అనంతరం వారి భవిష్యత్ లక్ష్యాల గురించి సూచనలు చేశారు.

కళాశాల యాజమాన్యం, సిబ్బంది మరియు విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫ్రెషర్స్ డే విద్యార్థులకు కళాశాల జీవితంలో తొలి మధురమైన అనుభూతిని అందించింది. కొత్త స్నేహాలు, ఉత్సాహం, జ్ఞాపకాలతో నిండిన ఈ రోజు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు, వారిని విద్యాపరంగా మరింత ముందుకు నడిపించేందుకు దోహదపడుతుందని కళాశాల యాజమాన్యం తెలిపింది.

కళాశాల యాజమాన్యం మలిశెట్టి రామ్మోహన్, శ్రీకాంత్ రెడ్డి, కేఓవి రమణ రావు అధ్యాపక ఆధ్యాపకేతర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page