top of page

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన మెగా అభిమానులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 1 day ago
  • 1 min read

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన మెగా అభిమానులు

పద్మభూషణ్, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన అభిమానులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆశ్రమ ఫౌండర్ సుబ్బరాయుడు హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిరంజీవి జన్మదిన వారోత్సవాలను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి మెగా అభిమానులు ఉండడం చిరంజీవి అదృష్టమని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు, బొల్లారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ బోర్డ్ మెంబర్ రామోజీ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిరంజీవి పుట్టినరోజును సేవా తత్పరత దినోత్సవం గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు, షరీఫ్, టైర్స్ సాగర్, బియ్యం కేశవ, రాము, నాయబ్, నంద మెగా శ్యామ్, బాబురావు, మధు, చెన్న రవి తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page