top of page

నీటి మోటార్ ల దొంగ అరెస్టు

Writer: EDITOR
EDITOR
Nov 6, 2023
1 min read

నీటి మోటార్ ల దొంగ అరెస్టు

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సి ఐ, ఎస్ ఐ
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సి ఐ, ఎస్ ఐ

రాజంపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ రెడ్డి ఆదేశాల మేరకు నందలూరు సబ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ జహీర్ తన సిబ్బంది తో తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఆల్విన్ నగర్ ప్రాంతం లో ఆల్విన్ కర్మాగారం వద్ద అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్న రాజంపేట మండలం, బోయిన పల్లి గ్రామం, చక్రధర్ కాలనీ కి చెందిన షేక్ మస్తాన్ (35) , తండ్రి సయ్యద్ సాబ్ ఉల్లి వ్యాపారం చేసే వ్యక్తి చూసి అతనిని తనిఖీ చేయగా సుగుణ కంపెనీ కి చెందిన 1HP కెపాసిటీ గల 5, మరియు 1/2 HP కెపాసిటీ 1. మొత్తం 6 మోటార్ లు లభ్యం కాగా, వీటి విలువ రూపాయలు 75,000 ఉంటాయి అని ఎస్ ఐ తెలిపారు. వీటిని నందలూరు మండలంలో నిర్మాణం లో ఉన్న ఇండ్ల వద్ద దొంగలించి ఉంటాడని అదుపులోకి తీసుకొని విచారించగా తేలింది. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ లు, కానిస్టేబుల్ లు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page