top of page

రేపు తుది జాబితా ప్రకటన

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
3 hours ago
1 min read

రేపు తుది జాబితా ప్రకటన

ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

ప్రొద్దుటూరు, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ, మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లేదా ఏకగ్రీవమైన వార్డుల తుది జాబితాను అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు.


సవరించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1, 2026న పోలింగ్, నవంబర్ 3, 2026న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. అయితే వార్డుల్లో అభ్యర్థుల ఏకగ్రీవాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ షెడ్యూల్ మార్పులను అభ్యర్థులందరూ గమనించి, సంబంధిత ఎన్నికల ప్రక్రియకు నిర్ణీత సమయాల్లో హాజరుకావాలని సూచించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page