పత్రికా విలేకరి నుంచి ప్రజానాయకుడి వరకు...

పత్రికా విలేకరి నుంచి ప్రజానాయకుడి వరకు..
30వ వార్డు ఏకగ్రీవ కౌన్సిలర్‌గా.. ఉట్టి నరేంద్ర.. ప్రభంజనం..

కడప జిల్లా ప్రొద్దుటూరు
అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని సుమారు 17-18 ఏళ్ల పాటు పత్రికా విలేకరిగా, వివిధ న్యూస్ ఛానెళ్ల ప్రతినిధిగా నిక్కచ్చిగా వ్యవహరించిన ప్రముఖ జర్నలిస్ట్, జర్నలిస్టుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు ఉట్టి నరేంద్ర ప్రజాసేవలో తన అంకితభావానికి నిదర్శనంగా నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు.. తన రాజకీయ గురువు, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆశీస్సులతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 30వ వార్డు అధికార కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై సంచలనం సృష్టించారు.. ఈ రోజు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో తన శ్రీమతి, తండ్రి సమక్షంలో మున్సిపల్ ఎన్నికల అధికారుల నుంచి ఆయన అధికారిక డిక్లరేషన్ ఫారమ్‌ను అందుకున్నారు..
జర్నలిజంలో చెరగని ముద్ర.. నిజాయితీకి నిలువుటద్దం..
సుదీర్ఘమైన జర్నలిజం ప్రయాణంలో.. వార్తా, సూర్య దినపత్రికలతో పాటు TV5, NTV, V6, Zee 24, STUDION NEWS వంటి ప్రముఖ న్యూస్ ఛానళ్లలో విలేకరిగా పనిచేసిన ఉట్టి నరేంద్ర నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇచ్చారు.. వార్తలను అందించడంలోనే కాదు, జర్నలిస్టుల సంక్షేమం కోసం అధ్యక్షుడిగా ముందుండి నడిపిన తీరు ఆయనలోని నాయకత్వ పటిమను చాటిచెప్పింది.. కత్తిమీద సాము లాంటి జర్నలిజం వృత్తిలో ఏనాడూ నిజాయితీని వదలకుండా సుదీర్ఘకాలం పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్నారు..
రాజకీయం ఒక తపస్సు.. గురువు ఆశీస్సులతో విజయం..
జర్నలిజం ద్వారా సమాజానికి చేసిన సేవలను మరింత విస్తృతం చేసేందుకు 2019లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారాయన. 2021 మున్సిపల్ ఎన్నికల్లో 30వ వార్డు నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో విజయాన్ని చేజార్చుకున్నప్పటికీ, అధైర్యపడకుండా వార్డు ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు.. తనపై నమ్మకంతో నిలబడిన నరేంద్రలోని నిబద్ధతను గుర్తించిన ఆయన రాజకీయ గురువు, ప్రొద్దుటూరు ప్రజాదరణ పొందిన నాయకుడు నంద్యాల వరదరాజుల రెడ్డి కనివిని ఎరుగని రీతిలో ఆయనకు మద్దతుగా నిలిచారు.. గురువు అందించిన ప్రోత్సాహం, చూపించిన దిశానిర్దేశంతో ఇవాళ ఎలాంటి పోటీ లేకుండా 30వ వార్డు కౌన్సిలర్‌గా ఉట్టి నరేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. గురుశిష్యుల బంధానికి, పరస్పర విశ్వాసానికి ఈ విజయం ఒక మచ్చుతునకగా నిలిచింది..
కుటుంబం అందించిన ధైర్యం.. వెన్నుతట్టిన ప్రోత్సాహం
ఏ వ్యక్తి విజయానికైనా కుటుంబ మద్దతు అత్యంత కీలకం.. నరేంద్ర సుదీర్ఘ జర్నలిజం ప్రయాణంలోనూ, సవాళ్లతో కూడిన రాజకీయ ప్రయాణంలోనూ ఆయన తండ్రి చూపిన మార్గదర్శకత్వం, శ్రీమతి అందించిన నిరంతర తోడ్పాటు ఎంతో అభినందనీయం.. కష్టసమయాల్లోనూ ఆయన వెంటే ఉంటూ, ప్రజాసేవలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు డిక్లరేషన్ ఫారం అందుకోవడం వారి త్యాగానికి దక్కిన గౌరవంగా వార్డు ప్రజలు కొనియాడుతున్నారు..
భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. కౌన్సిలర్ ఉట్టి నరేంద్ర.. డిక్లరేషన్ ఫారం అందుకున్న అనంతరం నరేంద్ర మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.. ఈ రోజు నుంచి నేను నా 30వ వార్డు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాను.. ప్రజలతో మమేకమై వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తాను.. నా పరిధిలో ఉన్నంతలో కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ నా చేతనైన సహాయం అందిస్తాను.. వార్డు ప్రజలను మరింత చైతన్యపరిచి అభివృద్ధి పథంలో నడిపిస్తానని భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. నన్ను ఈ స్థాయికి తెచ్చిన నా రాజకీయ గురువు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కి, నా కుటుంబానికి, నన్ను ఆదరించిన వార్డు ప్రజలకు నా జీవితాంతం రుణపడి ఉంటాను..
ఒక సామాన్య విలేకరిగా మొదలై, నిబద్ధతతో కూడిన జర్నలిజం చేస్తూ, ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఎదిగి ఏకగ్రీవ కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉట్టి నరేంద్ర కి వార్డు ప్రజలు, పత్రికారంగ ప్రముఖులు, అభిమానులు మరియు టిడిపి నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..





Comments