top of page

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

Writer: EDITOR
EDITOR
16 hours ago
1 min read

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

చలో ఢిల్లీ డిసెంబర్ 1, 2, 3 తేదీల కార్యక్రమం జయప్రదం చేయండి అని జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు తుట్టా నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు ముఖ్య కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. అలాగే స్థానిక 120 వార్డుల జివిఎంసి కార్పొరేటర్ల & జివిఎంసి మేయర్ ఎన్ని కల్లో పోటీకి సిద్ధంగా ఉన్న వారు కి ఆల్ ది బెస్ట్ జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మన స్థానిక సమస్యలు పరిష్కారానికి, విశాఖ అభివృద్ధి ప్రయాణానికి ఊరులో జనాభాకు తగ్గట్టుగా కార్మికుల సంఖ్య పెంచాలని, ఇప్పటివరకు పెండింగు లో ఉన్న రిటైర్మెంట్ & డెత్ పోస్ట్లు భర్తీ చెయ్యాలని డిమాండ్స్ సాధనకే ప్రభుత్వం ఆలోచన ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే కార్పొరేటర్లు & మేయర్ కు కార్మికుల సంక్షేమం గుర్తు చెయ్యాలన్నారు. గొలగాని అప్పారావు, ముద్దాడ ప్రసాద్, జే.ఆర్. నాయుడు, నక్క నాగరాజు, ఈశ్వర రావు, అనిల్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page