top of page

టిప్పర్ ను ఢీకొన్న ద్విచ్రవాహనం - ఇద్దరు యువకులు దుర్మరణం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 25, 2023
  • 1 min read

టిప్పర్ ను ఢీకొన్న ద్విచ్రవాహనం - ఇద్దరు యువకులు దుర్మరణం

రాజుపాలెం మండలంలోని గోపవరం, కొర్రపాడు గ్రామాల మధ్య, రోడ్డుపై ఆగి ఉన్న మట్టి టిప్పర్ ను ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం సాయంత్రం సమయంలో చీకటి పడిన తర్వాత మండల కేంద్రమైన రాజుపాళెం గ్రామానికి చెందిన బంగ్లా అల్తాఫ్ వయసు 18, నంద్యాల మస్తాన్ రెడ్డి వయసు 21 అనే ఇద్దరు యువకులు పనిమీద ప్రొద్దుటూరు పట్టణానికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలం వద్దనే ఇద్దరు యువకులు మృతి చెందారు. సంఘటన స్థలాన్ని ప్రొద్దుటూరు రూలర్ సిఐ రమణారెడ్డి ,రాజుపాళెం ఎస్ ఐ రాజగోపాల్ పరిశీలించారు. సంఘటన సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో రాజుపాళెం గ్రామంలోని వారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page