"సంపద సృష్టిస్తా అని అప్పుల కుప్ప చేశారు" - రాచమల్లు
- VOICE OF HERALD

- 12 minutes ago
- 1 min read
"సంపద సృష్టిస్తా అని అప్పుల కుప్ప చేశారు" - రాచమల్లు

అమృతనగర్ లో 50 కుటుంబాల YSRCP లో చేరిక
వరదరాజులరెడ్డి అభివృద్ధిపై రాచమల్లు సవాల్
కూటమి హామీలపై మండిపాటు - వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కూటమి ప్రభుత్వం నుండి ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె పంచాయతీ అమృత నగర్ లో సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్సిపి లో చేరాయి. రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సమక్షంలో ఖాదర్ బాషా తనయుడు నూర్ బాషా ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి రాచమల్లు స్వాగతం పలుకుతూ, అమృతనగర్ ప్రజలు గతంలో 3 సార్లు తనకు ఓటు వేసి ఆదరించారని, 2024 లో ఓడినా తోడుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. నాడు వైఎస్ఆర్ 2006లో అమృతనగర్ ను స్థాపించారని, తమ ప్రభుత్వ హయాంలో 15 కోట్లతో 72 రోడ్లు, 2 కాలువలు, 70 లక్షలతో నాగాయపల్లె నుంచి నీరు తెచ్చామని గుర్తు చేశారు. పుష్కర కాలంగా ఎమ్మెల్యేగా ఉన్న నంద్యాల వరదరాజుల రెడ్డి ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
"సంపద సృష్టిస్తా అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు" అంటూ చంద్రబాబు పై రాచమల్లు తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, 3 గ్యాస్ సిలిండర్లు, కరెంటు బిల్లులు పెంచడం, ఆరోగ్యశ్రీని అటకెక్కించడం వంటి మోసాలతో పేదలను మోసం చేశారని ఆరోపించారు. "మీ కుమారుడు మనవడు విదేశాల్లో చదువుకోవాలి, పేద పిల్లలు దుర్భరంగా చదవాలా?" అని ప్రశ్నించారు? వచ్చే ఎన్నికల్లో అమృతనగర్ ప్రజలు వైయస్సార్సీపి కి ఓటు వేసి కూటమి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. "ఇవాళ్టి నుంచి మీ బిడ్డగా, పెద్ద కొడుకుగా తోడుంటాను" అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అమృతనగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





Comments