top of page

వరుస దొంగతనాలతో ప్రొద్దుటూరు వాసులు బెంబేలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 4, 2024
  • 1 min read

వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరులో వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న పట్టణవాసులు. శనివారం లెక్చరర్ ఇంట్లో దొంగతనం జరుగుగా, ఆదివారం తెల్లవారుజామున బియ్యం వ్యాపారం చేసుకునే మదనపల్లి చంద్రశేఖర్ కు చెందిన దుకాణంలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే ఆదివారం తెల్లవారుజామున మైదుకూరు రోడ్డు లోని డాక్టర్ వైయస్సార్ విగ్రహం వద్ద గల ఐదు దుకాణాలకు వేసిన తాళాలను తొలగించిన దొంగలు, లావాదేవీల ద్వారా దాదాపు లక్ష రూపాయల నగదు టేబుల్ డ్రాయర్ నందు ఉంచి నిన్న రాత్రి 8:45 ప్రాంతంలో ఇంటికి వెళ్లిన చంద్రశేఖర్ కు, ఉదయం ఆరు గంటల 40 నిమిషాల ప్రాంతంలో తన తోటి వ్యాపారస్తులు కాల్ చేసి మీ దుకాణ వాకిలి తెరిచి ఉన్నదని తెలిపారు. దుకాణం వద్దకు చేరుకున్న చంద్రశేఖర్ డ్రాయర్ లో ఉంచిన దాదాపు లక్ష రూపాయల డబ్బులు దొంగలు కాజేసారంటూ వాపోతున్నాడు, అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లు అనుమానిస్తున్నారు. దుకాణం వద్దకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు, పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page