top of page

ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో చోరీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 3, 2024
  • 1 min read

ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో చోరీ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా, ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డు లోని ఓ ఇంటిలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే, ప్రొద్దుటూరు పట్టణం లోని మాస్టర్స్ కాలేజీ నందు లెక్చరర్ గా పనిచేస్తున్న సంజీవ దైవ కార్య నిమిత్తం కుటుంబంతో సహా ఆర్లగడ్డకు వెళ్ళగా, ఎవరూ లేని సమయం చూసి దుండగులు తాళాలు పగలగొట్టి బీరువాలోని రెండు తులాల బంగారు, దాదాపు 40 వేల రూపాయలు డబ్బు చోరీ చేశారు ఆని బాధితుడు వాపోతున్నాడు. శనివారం ఉదయం ఇంటి ప్రధాన వాకిలి తెరిచి ఉండటం చూసిన ఇరుగుపొరుగు వారు సంజీవ కు కాల్ చేసి విషయం చెప్పగా, ఆయన ప్రొద్దుటూరుకు బయలుదేరి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page