top of page

పోలీస్ స్టేషన్ లో బైఠాయించిన టిడిపి శ్రేణులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 22, 2024
  • 1 min read

పొద్దుటూరు పోలీస్ స్టేషన్ లో బైఠాయించిన టిడిపి శ్రేణులు

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు ఎస్ఈబీ స్టేష‌న్‌లో ఎస్పీని దూషించిన వైకాపా ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాదురెడ్డి కేసు న‌మోదు చేయాల‌ని తెదేపా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి డిమాండు చేశారు. మూడో ప‌ట్ట‌ణ ఠాణాలో తెదేపా ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు జ‌బివుల్లా, నాయ‌కుల‌తో క‌లిసి ఆయ‌న నేల పై బైఠాయించి ఆందోళ‌న‌ చేశారు. బాకీ డ‌బ్బులు అడిగినందుకు తెదేపా నాయ‌కుడు ద‌స్త‌గిరి ఆయ‌న కుమారుడి పై హ‌త్యాయ‌త్నం, కిడ్నాప్ కేసు న‌మోదు చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. 2022లో న‌మోదైన హ‌త్యాయ‌త్నం కేసులో వైపాపా నాయ‌కుల‌ను ఎందుకు అరెస్టు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు? మ‌హిళా ఎస్సై పై ఇసుకాసురులు డాడి చేస్తే నిందితునులను ఇప్ప‌టికీ ప‌ట్టుకోలేద‌న్నారు. పోలీసులు సంఘాలు ఏం చేస్తున్నాయ‌ని ప్రశ్నించారు?


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page