top of page

పాత బీగాలతో బైక్‌లు చోరీ చేసిన స్విగ్గి డెలివరీ బాయ్ అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 3
  • 1 min read

పాత బీగాలతో బైక్‌లు చోరీ చేసిన స్విగ్గి డెలివరీ బాయ్ అరెస్ట్

ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు 3.5 లక్షల విలువ గల ఏడు పైపులు స్వాధీనం

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


పాత బీగాలు ఉపయోగించి పట్టణంలో వరుసగా మోటార్ సైకిల్స్ దొంగతనాలు చేస్తున్న 22 ఏళ్ల యువకుడిని ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 7 వివిధ కంపెనీల బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 3,50,000/-. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ ఐపీఎస్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అరెస్టైన ముద్దాయి సూర్య గురు తేజ (22 సంవత్సరాలు) స్విగ్గి డెలివరీ బాయ్ గా పని చేస్తూ ప్రొద్దుటూరు పరిధిలోని పెన్నా నగర్ లో నివాసం ఉంటున్నాడు.


ఘటన వివరాలు :


03.08.2026 నాడు మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చిన సమాచారం మేరకు ఈశ్వర్ రెడ్డి నగర్‌లోని అక్క దేవతల గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సూర్య గురు తేజను సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మరియు వారి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో విచారించగా అతను వరుస బైక్ చోరీలు చేసినట్లు అంగీకరించాడు. పాత బీగాలు మరియు మాస్టర్ కీ ఉపయోగించి లాక్ చేసిన బైక్‌లను సులువుగా దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.


అనంతరం మధ్యాహ్నం 5.00 గంటలకు అతనిని అరెస్ట్ చేసిన ప్రొద్దుటూరు ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.


స్వాధీనం చేసుకున్న వాహనాలు


పోలీసులు ముద్దాయి వద్ద నుండి ఈ 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు, మొత్తం 7 వాహనాల విలువ సుమారు రూ. 3,50,000/- ఉంటుందని అంచనా.


ఫిర్యాదుదారు వివరాలు


ఈ కేసులో మొదటి ఫిర్యాదుదారు జేష్టాది సునీల్ కుమార్, వయస్సు 32, ప్రభుత్వ ఆసుపత్రి టెక్నీషియన్, మాలెపాడు గ్రామం, యర్రగుంట్ల మండలం.


పోలీసుల హెచ్చరిక


ఈ కేసుపై స్పందించిన ప్రొద్దుటూరు ఏ ఎస్ పి యు. విభూ కృష్ణన్ ఐపీఎస్ "పట్టణంలో వాహనదారులు తమ బైక్‌లను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయాలి, డబుల్ లాక్ వేయాలి, అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి" అని సూచించారు. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న బైక్ చోరీలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page