top of page

భారత్ జోడో యాత్ర పర్యటన పై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 14, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా


రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పర్యటన పై సమీక్ష సమావేశం - జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్.


భధ్రత ఏర్పాట్ల పై ఆరా తీసినా - జిల్లా ఎస్పీ

సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, మాధవరం చెక్ పోస్టు మీదుగా ఆంధ్రా - కర్ణాటక బార్డర్ దాటే వరకు రాహుల్‌ గాంధీ పాదయాత్ర లో ఎటువంటి సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ తెలిపారు.

ఈ సందర్భంగా శుక్రవారం మంత్రాలయంలోని అబోడ్ హోటల్ నందు సమీక్షా సమావేశం నిర్వహించి జిల్లా ఎస్పీ మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్బంగా పోలీసు అధికారులు గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని. హైవేలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోలీసు అధికారులు పూర్తిస్థాయి చర్యలు చేపట్టాలన్నారు.


ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగబాబు, ఆదోని ఆర్డిఓ రామకృష్ణా రెడ్డి, ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్, సిఐలు భాస్కర్, లక్ష్మమయ్య, ఆర్ఐలు, ఎస్సై లు, ఆర్ ఎస్సైలు, ఇంటెలిజెన్స్, సిఆర్ ఫిఎఫ్ అధికారులు హాజరయ్యారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page