top of page

ప్రొద్దుటూరులో ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ వార్షిక తనిఖీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 5
  • 1 min read

ప్రొద్దుటూరులో ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ వార్షిక తనిఖీ

కడప జిల్లా, ప్రొద్దుటూరు


జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ వార్షిక తనిఖీల్లో భాగంగా ప్రొద్దుటూరులోని అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శించి పెండింగ్ కేసులు, రికార్డుల నిర్వహణ, మౌలిక వసతులు, ప్రజా సేవలపై సమీక్ష నిర్వహించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి కేసును చట్టబద్ధంగా విచారించాలని సిబ్బందికి సూచించారు. యువత గంజాయితో సహా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనలో ప్రజలు, తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా అరికట్టేందుకు 2 డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page