top of page

జిల్లా ఎస్పీని సన్మానించిన కొనిరెడ్డి శివచంద్రారెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 23, 2023
  • 1 min read

జిల్లా ఎస్పీని సన్మానించిన కొనిరెడ్డి శివచంద్రారెడ్డి

ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ని సన్మానిస్తున్న కొనిరెడ్డి

వైయస్సార్ జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ కౌశల్ ను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గత ఎస్పీ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎంతో పకడ్బందీగా, సమర్థవంతంగా వ్యవహరించారని అలాగే సిద్ధార్థ కౌశల్ నేతృత్వంలో కూడా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ జరుగుతుందనే ఆశాభావాన్ని కొనిరెడ్డి వ్యక్తం చేశారు. ఎస్పీ ని కలిసిన వారిలో కొత్తపల్లి పంచాయతీ 13వ వార్డు మెంబర్ కొన్ని రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page