top of page

అక్రమ ఇసుక రవాణా వ్యక్తుల మధ్య గొడవ దాడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 7, 2024
  • 1 min read

అక్రమ ఇసుక రవాణా వ్యక్తుల మధ్య గొడవ దాడి

కడప జిల్లా జమ్మలమడుగులో అక్రమ ఇసుక రవాణా విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరొకరిపై గొడ్డలితో దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయమైంది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

జమ్మలమడుగు పట్టణం దిగుపట్నం కాలనీ చెందిన వెంకట నారాయణ, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు జప్తు చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చింది నువ్వంటే నువ్వేనని ఇద్దరు గొడవపడి జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో వెంకట నారాయణ పై కిరణ్ గొడ్డలితో తలపై దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. గాయం తీవ్రం కావడంతో జమ్మలమడుగు ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page