top of page

హౌసింగ్ శాఖ అవినీతిపై ఎమ్మెల్యే ఫిర్యాదును స్వాగతిస్తున్నాం - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 1 day ago
  • 1 min read

హౌసింగ్ శాఖ అవినీతిపై ఎమ్మెల్యే ఫిర్యాదును స్వాగతిస్తున్నాం - మాజీ ఎమ్మెల్యే రాచమల్లు

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


తమ పార్టీ అధికారంలో ఉండగా ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా 23 వేల మంది లబ్ధిదారులను గుర్తించి జగనన్న కాలనీల ద్వారా ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో రాచమల్లు మాట్లాడుతూ, హౌసింగ్ శాఖ పరిధిలో దాదాపు 268 టన్నుల స్టీల్ మాయం అవటంతో పిడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హౌసింగ్ ఏఈ సుబ్రహ్మణ్యం పాత్ర పై అనుమానంతో అతనిని కస్టడీలోకి తీసుకొని కేసు విచారణలో భాగంగా రిమాండ్ కు తరలించారని, దొంగిలించబడ్డ స్టీల్ కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యాలయానికి సంబంధం ఉందని ఆయన ఆరోపణలు గుప్పించారు. నిన్న జరిగిన డిఆర్సి మీటింగ్ నందు ఎమ్మెల్యే వరద హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవగాలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదును తాము స్వాగతిస్తున్నామని, పోలీసు శాఖ ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా పనిచేసి స్టీల్ దొంగిలించిన వారి వద్ద నుండి రికవరీ చేయాలని, అప్పుడే ప్రజలకు పోలీసు శాఖపై నమ్మకం కలుగుతుందన్నారు. స్టీల్ దొంగతనానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని ఆయన అన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page