చోరీ జరిగిన 24 గంటల్లోనే సొత్తు రికవరీ
- VOICE OF HERALD

- Jun 17
- 1 min read
చోరీ జరిగిన 24 గంటల్లోనే సొత్తు రికవరీ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన రూ.23 లక్షల భారీ చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. బంగారం కొనుగోలు కోసం దాచిన నగదుపై కన్నేసిన సొంత గుమాస్తా, తన స్నేహితుడితో కలిసి యజమాని లేని సమయంలో నగదును అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన బాధితుడు దాచిన రూ.23 లక్షల నగదును గుమాస్తా ప్రద్మేష్ బాబాసాహెబ్ తన స్నేహితుడు మిలింద్ చంద్రకాంత్‌తో కలిసి దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.22.91 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించి బాధితుడికి న్యాయం చేసిన త్రీ టౌన్ సీఐ, సిబ్బందిని ఏఎస్పీ విభూ కృష్ణ అభినందించారు.




Comments