top of page

ప్రొద్దుటూరు వైసిపి నాయకుని లైంగిక వేధింపులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 5, 2024
  • 1 min read

ప్రొద్దుటూరు వైసిపి నాయకుని లైంగిక వేధింపులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు వైసిపి అభ్యర్థి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు వడ్ల దాదా పీర్ తనకు మాయ మాటలు చెప్పి.. బెదిరించి రెండు సంవత్సరాలు గా శారీరకంగా హింస్తున్నాడు అని ప్రొద్దుటూరులోని మోక్షగుండం వీధిలో నివాసముంటున్న అష్రాఫ్ జహ (19) అనే అమ్మాయి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసింది... వైసీపీ నేత వడ్ల దాదాపీర్ ఇంట్లో అద్దెకు ఉన్న సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు తనకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడని.. తరువాత తన వద్ద న్యూడ్ ఫోటోలు ఉన్నాయని తాను చెప్పినట్లు వినకుంటే ఆ ఫోటోలు బయట పెడతానని బెదిరించి శారీరకంగా హింసిస్తున్నాడని మహిళ తెలిపింది. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన వేధింపులు ఎక్కువయ్యాయని తన మాట వినకుంటే తన తల్లి జమీలా ను చంపేస్తానని వైసీపీ నేత వడ్ల దాదాపీర్ బెదిరిస్తున్నాడని సదరు మహిళ వాపోయింది.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page