ప్రొద్దుటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ప్రొద్దుటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు రామేశ్వరం రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ఖాళీ స్థలంలో సాగుతున్న పేకాట స్థావరంపై వన్ టౌన్ పోలీసులు మెరుపు దాడి చేశారు. అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏఎస్పీ విభూ కృష్ణ ఆదేశాలతో, వన్ టౌన్ సీఐ టి.వి. కొండారెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, సిబ్బంది కలిసి దాడి నిర్వహించారు. అక్కడ 'లోపల బయట' జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడిలో పట్టుబడిన వారిని ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన కుమార రమేష్ (39), షేక్ మజీద్ భాష (30), మోపురి రవీంద్రారెడ్డి (36), సాలంకు ఉపేంద్ర (26), సుంకేసుల గురు ప్రతాప్ (30), దూదేకుల మదార్ వల్లి (35)గా గుర్తించారు. నిందితుల నుంచి రూ.22,870 నగదుతో పాటు 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






ప్రొద్దటూరు పోలీస్ వారికీ ధన్యవాదములు
సర్ పూర్తి అమృతానగర్ మొత్తమ్ లొ తాగుబోతులు రౌడీ ముకలు అల్లరి చిల్లర కుర్రవాళ్ళు వాళ్ళు చేసే గొడవలు ఇవ్వి అన్నీటీ మీద కాస్తా దృష్టి పెట్టి వారిని అరికట్టాలని పోలీస్ వారిని కోరుకుంటున్నాము