ప్రొద్దుటూరులో వైసీపీ ర్యాలీకి పోలీసుల అడ్డంకి
- VOICE OF HERALD

- Aug 10
- 1 min read
ప్రొద్దుటూరులో వైసీపీ ర్యాలీకి పోలీసుల అడ్డంకి



కడప జిల్లా, ప్రొద్దుటూరు
DSC నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నేడు ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ర్యాలీకి పిలుపునిచ్చిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. వన్ టౌన్ సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ "అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు" అని హెచ్చరించారు.
పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా నిరసన తెలియజేసి తీరుతామని వైసీపీ నేతలు పట్టుబట్టారు. "DSC లో జరిగిన అవకతవకలపై ప్రశ్నించే హక్కు మాకుంది. నోటీసులతో మా గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది" అని వారు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.




Comments