ఆన్‌లైన్ మట్కా బీటర్ అరెస్ట్

ప్రొద్దుటూరులో ఆన్‌లైన్ మట్కా బీటర్ అరెస్ట్: రూ.7,000 నగదు, మొబైల్ స్వాధీనం

ప్రొద్దుటూరు పట్టణంలో ఆన్‌లైన్ మట్కా నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడింపల్లి ప్రాంతానికి చెందిన షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో మట్కా జూదం నడుపుతున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.7,000 నగదుతో పాటు జూదానికి ఉపయోగిస్తున్న ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
పట్టణంలో ఆన్‌లైన్ మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని వన్ టౌన్ సీఐ కొండారెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. అమాయక ప్రజలు, యువత ఇలాంటి జూదాల బారిన పడి జీవితాలను, ఆర్థిక పరిస్థితిని నాశనం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. ఎక్కడైనా మట్కా లేదా ఇతర చట్టవ్యతిరేక పనులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ స్పష్టం చేశారు.






Comments