సెప్టెంబర్ 9 ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీ - టీడీపీ

సెప్టెంబర్ 9 ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్ర రాజకీయ చరిత్రలో సెప్టెంబర్ 9 ఒక దుర్దినంగా మిగిలిపోయిందని ప్రొద్దుటూరు టిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు. సాయంత్రం స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు కొవ్వొత్తులు వెలిగించి అక్రమ కేసులను ఛేదించి నిలిచిన నిజాయితీపై నాయకులు మాట్లాడుతూ, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా తెలుగు ప్రజలకు సేవలందించిన చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ నాటి వైసీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నారనే కక్షతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేశారని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనను 53 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచి తీవ్ర వేధింపులకు గురిచేసినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళం ఎత్తటాన్ని అభినందించారు. న్యాయస్థానాలు సైతం నాటి పాలకుల తీరును తప్పుబట్టి, స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేయడంతో నిజాయితీ ఎవరికీ తలవంచదని మరోసారి నిరూపితమైందన్నారు. అక్రమ కేసులతో అణగదొక్కాలని చూసిన శక్తులకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెబుతూ చంద్రబాబు నాయుడుకు ఘన విజయాన్ని కట్టబెట్టారన్నారు.
ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి పనులను అడ్డుకోవడమే ఏకైక అజెండాగా వైసీపీ వ్యవహరిస్తోందనీ, నిరుద్యోగ యువతకు మేలు చేసేలా చేపట్టిన 16 వేలకు పైగా పోస్టుల మెగా డీఎస్సీ ప్రక్రియపై కోర్టుల్లో 300కు పైగా కేసులు వేయించి ఆటంకాలు సృష్టించడమే కాకుండా, పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు పూర్తవుతుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా రాజధాని అమరావతితో పాటు పోలవరం, వెలిగొండ, పట్టిసీమ వంటి కీలక ప్రాజెక్టులను అడ్డుకునేందుకు నిరంతరం విఫలయత్నాలు చేస్తూ, సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిజాయితీకే అంతిమ విజయం దక్కుతుందనే నమ్మకంతో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నవ్యాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు 'స్వర్ణాంధ్ర విజన్ 2047' లక్ష్యంతో రాష్ట్రం పురోగమిస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు టిడిపి నాయకులు అన్నారు.






Comments