top of page

మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 2, 2022
  • 1 min read

మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్

పశ్చిమగోదావరి జిల్లా, ఇటీవల సస్పెండైన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ ఎం.జీవన్‌బాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. నరసాపురం రూరల్‌ సీఐ ఎం.సురేష్‌బాబు కథనం ప్రకారం.. నిషేధిత ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములను రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయడంపై ఇటీవల నరసాపురం సబ్‌ కలెక్టర్‌ ఎం.సూర్యతేజ విచారణ చేపట్టారు. రికార్డులు పరిశీలించగా మొగల్తూరు, నరసాపురం, భీమవరం మండలాలకు చెందిన 48 భూములు రిజిస్ట్రేషన్‌ చేసినట్టుగా విచారణలో తెలింది. దీనిపై సబ్‌ కలెక్టర్‌ ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ క్రమంలో ఆయా మండలాల తహసీల్దార్ల ఫిర్యాదుతో సబ్‌ రిజిస్ట్రార్‌ జీవన్‌ బాబును అరెస్ట్‌ చేసినట్టు సీఐ తెలిపారు.

CALL NOW : 9912324365
CALL NOW : 9912324365

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page