top of page

పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ఐపీఎస్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 27, 2023
  • 1 min read

ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్

పోలీస్ స్టేషన్ పరిశీలిస్తున్న ఎస్పి సిద్ధార్థ్ కౌశల్ ఐపిఎస్

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని ఒకటవ, రెండవ, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లతో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. సిబ్బంది పని తీరును గురించి అడిగి తెలుసుకుని, తగిన సూచనలు, సలహాలు చేశారు, స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. పాఠశాలల్లో, పబ్లిక్ ప్రదేశాలలో డ్రగ్స్, చైల్డ్ మ్యారేజెస్, 'దిశ' యాప్, మహిళలపై జరిగే నేరాలు, ఆన్ లైన్, సైబర్ మోసాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా ఎస్పీ వెంట ప్రొద్దుటూరు ఏఎస్పి ప్రేరణ కుమార్ ఐపిఎస్ ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page