top of page

బాలిక ప్రాణాలు కాపాడిన జర్నలిస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 31, 2022
  • 1 min read

తణుకు, కాలువలోకి దూకి ఆత్మహత్య యత్నంకు ప్రయత్నించిన 16 ఏళ్ల బాలికను అత్యంత చాకచక్యంగా ప్రాణాలకు తెగించి ఒక జర్నలిస్ట్(నిడదవోలు,మహా టీవీ రిపోర్టర్ వీరేంద్ర) కాపాడిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి తణుకు పట్టణంలో చోటుచేసుకుంది.


తణుకు పట్టణ ఎస్.ఐ కె.గంగాధర్ అందించిన వివరాలు ప్రకారం తణుకు పాతురు కు చెందిన 16 ఏళ్ల బాలిక ఆదివారం రాత్రి ఎగ్జిబిషన్ కు వెళ్లి స్నేహితులతో మాట్లాడుతుండగా, అబ్బాయిలతో మాటలు ఏంటని తల్లి మందలించడంతో మనస్తాపం చెంది తణుకు అత్తిలి కాలువలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వీరేంద్ర బాలిక దూకడం గమనించి వెంటనే కాలువలోకి దూకి బాలికను రక్షించాడు. తణుకు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులుకు అప్పగించినట్లు ఎస్.ఐ గంగాధర్ తెలిపారు. ప్రాణాలకు తెగించి బాలికను రక్షించిన మహా టీవీ రిపోర్టర్ వీరేంద్ర ను గంగాధర్ అభినందించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page