top of page

గంజాయి స్వాధీనం మహిళ ఇరువురు పురుషులు అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 18
  • 1 min read

గంజాయి స్వాధీనం మహిళ ఇరువురు పురుషులు అరెస్ట్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరులో గంజాయి విక్రయాలపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ప్రత్యేక దాడుల్లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు.


ప్రొద్దుటూరు మూడవ పట్టణ పోలీసులకు అందిన సమాచారంతో బొల్లవరం సమీపంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు పురుషులు, ఓ మహిళను అరెస్టు చేశారు. విచారణలో మహిళ ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ప్రొద్దుటూరులో విక్రయిస్తున్నట్లు, మిగిలిన ఇద్దరు ఆమె వద్ద నుంచి కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.3 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. గంజాయి విక్రయాలు, రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Jul 19

great job

gif

Like
bottom of page