top of page

అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్న - మాజీ ఎమ్మెల్యే వరద

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 12, 2024
  • 1 min read

అధికారులపై ఎమ్మెల్యే రాచమల్లు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్న - మాజీ ఎమ్మెల్యే వరద

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


అధికారులు తమ వృత్తిలో భాగంగా కేసులు నమోదు చేస్తే, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ అధికారుల పట్ల ప్రవర్తించిన తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. చట్ట సవరణ చేసే అధికారం వారి ప్రభుత్వ చేతిలో పెట్టుకొని అధికారులపై జులుం ప్రదర్శిస్తే ఎలా అని ప్రశ్నించారు? వైసిపి నాయకులు విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకుంటుండగా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు అధికారులపై మాట్లాడిన తీరును, అధికారులు నీతిమంతులుగా లేరన్న ఎమ్మెల్యే తాను ఎంత నీతిగా ఉన్నాడో ఒకసారి తనకు తాను ప్రశ్నించుకోవాలని, రాత్రి పగలు తేడా లేకుండా నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ, క్రికెట్ బెట్టింగ్, మట్కా లాంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రోత్సహించిన ఎమ్మెల్యే రాచమల్లు అవినీతిని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాను ఎంత నీతిపరుడో ఆలోచన చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వరద హితవు పలికారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page