top of page

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 11 minutes ago
  • 1 min read

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు


వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నందు Cr.No.166/2026 U/s 318(4), 351(2) r/w 3(5) BNS కింద కేసు నమోదు అయింది.


ఫిర్యాదు చేసిన వ్యక్తి కాంబోజి చిన్న పుల్లయ్య, వయసు 56 సంవత్సరాలు, ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీలోని ధార అపార్ట్మెంట్ నివాసి "శ్రీ సాయి యోషిత ట్రేడర్స్" పేరుతో చేపల దాణా వ్యాపారం చేస్తున్నారు. ఫిర్యాదు ప్రకారం, 2025లో కోనసీమ జిల్లా పోలవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కశిరెడ్డి వీర వెంకట దుర్గా ప్రసాద్ ఫిర్యాది వద్దకు వచ్చి, తాను చేపల చెరువుల యజమానులకు దాణా అమ్మి పెడతానని, కమీషన్ ఇవ్వాలని కోరాడు. మొదట 3 నెలల పాటు డబ్బులు సక్రమంగా చెల్లించడంతో ఫిర్యాది అతడిని నమ్మారు.


అనంతరం దుర్గా ప్రసాద్ తన స్నేహితులు ఉలవకాయల రామ స్వామి రమణ, విజయ్, ముద్రగడ రమేష్ లకు కూడా చేపల చెరువులు ఉన్నాయని, వారు చాలా నమ్మకమైన వారని చెప్పి దాణా సరఫరా చేయించాడు. ఈ నలుగురూ కలిసి ఫిర్యాదికి సరఫరా చేసిన దాణాకు సంబంధించిన మొత్తం రూ.64,00,000/- బిల్లులను గుర్తు తెలియని వ్యక్తుల పేరు మీద లావాదేవీలు నిర్వహించి మోసం చేశారు. డబ్బులు అడిగితే బెదిరించారని ఫిర్యాదిలో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు ఈరోజు ఎస్సై జి. మధు సూదన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page