ప్రొద్దుటూరు కోట్ల స్కామ్ ఆరోపణలపై రాజకీయ దుమారం - వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
- VOICE OF HERALD

- 11 minutes ago
- 1 min read
ప్రొద్దుటూరు కోట్ల స్కామ్ ఆరోపణలపై రాజకీయ దుమారం - వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరులో రూ.కోట్ల విలువైన భూ స్కామ్ ఆరోపణలపై రాజకీయ దుమారం రేగింది. టీడీపీ నేత, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు చేసిన వ్యాఖ్యలపై మాజీ వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బంగారు రెడ్డి, నాగరాజు విడుదల చేసిన ఆడియోలోని నిజానిజాలు తేలాలంటే "ఆడియోను పూర్తిగా వినిపించాలని" డిమాండ్ చేశారు. అలాగే "రెండున్నర కోట్ల రూపాయల వ్యవహారంపై విచారణ జరపాలని" మరియు "రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రూ.25 లక్షల వ్యవహారంపై" కూడా సమగ్ర విచారణ చేయాలని కోరారు. ఈ భూ వ్యవహారంలో అవకతవకలు జరిగి ఉంటే "సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని" ఆయన ప్రశ్నించారు? హజరయ్య అనే వ్యక్తిని పోలీసులు "15 రోజుల పాటు స్టేషన్‌కు పిలిచారని" ఆరోపిస్తూ, "పోలీసుల విచారణ తీరుపైనా" అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేసిన బంగారు మునిరెడ్డి, టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం బురదజల్లుతున్నారని ఆరోపించారు. "భూ వ్యవహారంలో అసలు వాస్తవాలు బయటపెట్టాలని" డిమాండ్ చేస్తూ, వైసీపీ హయాంలో "వందల కోట్ల భూ కుంభకోణానికి ఆధారాలు చూపాలని" టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. "నిరాధార ఆరోపణలతో బురదజల్లడం మానుకోవాలని" సూచించిన ఆయన, ఈ మొత్తం వ్యవహారంపై "పూర్తి విచారణతో నిజానిజాలు తేల్చాలని" ప్రభుత్వాన్ని కోరారు. ఈ వివాదంతో ప్రొద్దుటూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.





Comments