top of page

పెన్నా నగర్‌లో గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 57 minutes ago
  • 1 min read

పెన్నా నగర్‌లో గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు వన్ టౌన్ సి.ఐ. వెంకట కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ సభ్యులతో కలిసి పెన్నా నగర్‌లో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా అధికారులు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సి.ఐ. వెంకట కొండారెడ్డి మాట్లాడుతూ, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page