top of page

మాదకద్రవ్య రహిత భారత్ ను నిర్మిద్దాం - ప్రొద్దుటూరులో అవగాహన కార్యక్రమాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • 1 hour ago
  • 1 min read

మాదకద్రవ్య రహిత భారత్ ను నిర్మిద్దాం - ప్రొద్దుటూరులో అవగాహన కార్యక్రమాలు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంయుక్తంగా బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ‘నశాముక్త భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని నేడు ప్రొద్దుటూరులో నిర్వహించారు. శ్రీ విద్య జూనియర్ కళాశాల, సెయింట్ జోసెఫ్ స్కూల్, ఎస్సీఎన్నార్ జూనియర్ కాలేజీలలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు 10 కోట్ల మాదక ద్రవ్య రహిత ప్రతిజ్ఞ చేశారు.


యువత వ్యసనాల బారిన పడితే సమాజమే నష్టపోతుంది - బి.కె శాంత


ఓంశాంతి భవన్ నిర్వాహకులు బి.కె శాంత మాట్లాడుతూ, ప్రస్తుతం యువత సోషల్ మీడియా, డ్రగ్స్, మద్యం, సిగరెట్ వంటి వ్యసనాలకు ఎక్కువగా బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. "డ్రగ్స్ కు అలవాటుపడితే వ్యక్తి కెరీర్ తో పాటు కుటుంబం, సమాజం మొత్తం నష్టపోతుంది. చివరకు ఏకాకితనం మిగులుతుంది" అని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన విలువలతో కూడిన వ్యసనారహిత భారత్ నిర్మాణంలో ప్రతి యువకుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.


డ్రగ్స్ వల్ల బంగారు భవిష్యత్ నాశనం - మలిశెట్టి రామ మోహన్

విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, మనోస్థైర్యం పెంపు కోసం రాజయోగ ధ్యానం సాధన చేయించారు. "2025 గణాంకాల ప్రకారం 25 ఏళ్లలోపు యువత అధికంగా మాదకద్రవ్యాలకు బానిసలు అవుతున్నారు" అని ఆందోళన తెలిపారు. శ్రీ విద్య జూనియర్ కళాశాల డైరెక్టర్ మలిశెట్టి రామ మోహన్ మాట్లాడుతూ, టిడిఎ - టొబాకో, డ్రగ్, ఆల్కహాల్ దుర్వినియోగం వల్ల ఉజ్వల భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయని, ఎవరు ఒత్తిడి చేసినా నిగ్రహం పాటించాలని సూచించారు. యువత మత్తుకు దూరంగా ఉంటేనే దేశభద్రత, దేశాభివృద్ధికి తోడ్పడగలరని అన్నారు.


చెడు స్నేహాలు వద్దు - రాజయోగ ట్రైనర్ వాసు సూచన

రాజయోగ ట్రైనర్ వాసు మాట్లాడుతూ, మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. సెల్ఫోన్, టీవీని అధిక సమయం చూడటం వంటి వ్యసనాలను కూడా మానుకోవాలని సూచించారు. "చెడు స్నేహాలు చేయవద్దు. మీరు మాత్రమే కాకుండా స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించాలి" అని విద్యార్థులకు సందేశమిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ఆధ్యాపక బృందం, ఓంశాంతి సభ్యులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page