ప్రొద్దుటూరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు భారీ భద్రత.. 500 మీటర్ల పరిధిలో ఆంక్షలు, డ్రోన్లతో నిఘా

ప్రొద్దుటూరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు భారీ భద్రత.. 500 మీటర్ల పరిధిలో ఆంక్షలు, డ్రోన్లతో నిఘా

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎంపీడీవో (MPDO) కార్యాలయంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ (IPS) ఆదేశాల మేరకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని ప్రొద్దుటూరు డిఎస్పి బాలస్వామి రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు వివరాలు వెల్లడించారు. నామినేషన్ల సందర్భంగా పట్టణంలో పోలీస్ యాక్ట్ మరియు BNSS సెక్షన్ 163 అమలులో ఉన్నట్లు డీఎస్పీ బాలస్వామి రెడ్డి వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రం వద్ద డిజిగ్నేటెడ్ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ను అందుబాటులో ఉంచడంతో పాటు 4 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 150 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా నిబంధనలలో భాగంగా నామినేషన్ కేంద్రానికి 500 మీటర్ల పరిధిలో ప్రజలు, రాజకీయ సమూహాలు గుమికూడటం మరియు అనుమతి లేని వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. అలాగే 100 మీటర్ల పరిధిలోకి అభ్యర్థితో పాటు కేవలం ఒక ప్రపోజర్, ఒక అసిస్టెంట్‌కు మాత్రమే ప్రవేశం కల్పించారు.

నామినేషన్ కేంద్రం మరియు పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రొద్దుటూరుకు వచ్చే ప్రధాన మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై పోలీసులు నిఘా ఉంచారు. ఏ క్షణంలోనైనా అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు స్టాటిక్, రూట్ మొబైల్ పార్టీలు మరియు రియాక్షన్ టీమ్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, రెచ్చగొట్టే వార్తలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని డీఎస్పీ బాలస్వామి రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మరియు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.





Comments