top of page

అనుమానాస్పద స్థితిలో మతిస్థిమితం లేని బాలుడు మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 8, 2024
  • 1 min read

అనుమానాస్పద స్థితిలో మతిస్థిమితం లేని బాలుడు మృతి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా ప్రొద్దుటూరు లోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో ముస్తహీం(5) అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముస్తహీం పుట్టినప్పుడే తల్లి చనిపోయినది. పుట్టినప్పటినుంచి మతిస్థిమితం సరిగా లేక ముస్తహీం ఇంట్లోనే ఉండేవాడు. అయితే ముస్తహిం తల్లి చనిపోయాక మూడు సంవత్సరాల తర్వాత తండ్రి ఇమ్రాన్ రెండవ వివాహం చేసుకున్నాడు. ఈరోజు తెల్లవారుజామున ఇంట్లోనే ముస్తహీం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తండ్రి ఇమ్రాన్ ముస్లిం సంప్రదాయ ప్రకారం ఖననం ఏర్పాట్లు చేసే సమయంలో బాలుడి ఒంటిపై రక్త గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page