top of page

ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 9, 2023
  • 1 min read

కడప జిల్లా


కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలము ఎర్రగుంట్ల బైపాస్ లోని ఎస్వీ కళ్యాణ మండపం వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పులివెందుల నుండి శ్రీశైలం వెళ్తున్న AP 39 UN 4582 ఆర్టీసీ బస్సు, ప్రొద్దుటూరు నుండి మల్లెల కు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆరుగురికి గాయాలు కాగా నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు ప్రొద్దుటూరు ప్రకాష్ నగర్ కాలనీ కి చెందిన మహమ్మద్ (25) , షాకీర్ (10), హసీన (25), అమీన (20) గా గుర్తింపు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియరావలసి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప, కర్నూలు కు తరలించారు. క్షతగాత్రులను పరామర్శించిన జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page