top of page

డ్రైవర్ నిర్లక్ష్యం వృద్ధురాలు మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 15, 2023
  • 1 min read

డ్రైవర్ నిర్లక్ష్యం వృద్ధురాలు మృతి

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ఆ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వృద్ధురాలిని అందునా వికలాంగురాలిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే, ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధి లోని శ్రీనివాస నగర్ పోవు మలుపు వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, యాచక వృత్తి చేస్తూ భగత్ సింగ్ కాలనీ రెండో వీధికి నివసిస్తున్న వడ్ల వెంకటసుబ్బమ్మ, శ్రీనివాస నగర్ మలుపు వద్ద నుండి తన చేతి తోపుడు బండిలో వస్తుండగా, అటుగా శివాలయం వీధిలోకి ప్రయాణిస్తున్న ఏపీ 04 ఏఎస్ 9999 నంబరు గల మర్సిడిజ్ బెంజ్ కారు ఆమెను ఢీకొనగా వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవర్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంఘటనా స్థలం నుండి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియరావలసి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page