top of page

బిజెపి ఫ్లెక్సీల తొలగింపు... ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 22, 2023
  • 1 min read

బిజెపి ఫ్లెక్సీల తొలగింపు...

ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా ప్రొద్దుటూరులో భాజపా నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్షీలను పురపాలక సిబ్బంది తొలగించారు. శివాలయం కూడలి, మైదుకూరు రోడ్డులో డివైడరు మధ్యలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించడం పై భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటీలో భాజపా రాయలసీమ జోనల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరు అవుతున్నారు. ఆమెకు స్వాగతం పలుకుతూ పట్టణంలో పెక్సిలు కట్టారు. వాటిని తొలగిస్తున్నట్లు తెలియడంతో భాజపా నాయకులు మైదుకూరు రోడ్డుకు చేరుకున్నారు. తమ ప్లెక్సీలు ఎందుకు తీసివెస్తున్నారని పుర సిబ్బందిని నిలదీశారు. పోలీసులు అక్కడి చేరుకుని సర్దిచెప్పడంతో వివాదం సర్ధుమనిగింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page