కుప్పకూలిన బాలికల ప్రభుత్వ బీసీ వసతి గృహంలోని భవనం
- VOICE OF HERALD

- Apr 12, 2024
- 1 min read
అర్ధరాత్రి కుప్పకూలిన బాలికల ప్రభుత్వ బీసీ వసతి గృహంలోని భవనం - తృటిలో తప్పిన ప్రాణాపాయం


వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పట్టణం జమ్మలమడుగు రోడ్డులో ఉన్న బాలికల ప్రభుత్వ బీసీ వసతి గృహంలోని భవనం రాత్రి 11 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ సంఘటనలో త్రుటిలో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. చాలా పాత భవనం అవటం వలన కూలిన హాస్టల్ భవనం లోనికి ఎవరిని అనుమతించలేదు. సొంత హాస్టల్ భవనం లేక పాత చౌడు మిద్దెలో హాస్టల్ నిర్వహిస్తోన్న అధికారులు. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ. దాదాపు 40 మంది బాలికలు ప్రస్తుతానికి హాస్టల్లో ఉన్నట్లు సమాచారం.








Comments