top of page

బద్వేల్ లో అనుమానాస్పద రీతిలో మహిళ మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Sep 1, 2023
  • 1 min read

బద్వేల్ లో అనుమానాస్పద రీతిలో మహిళ మృతి

కడప జిల్లా, బద్వేల్, కడప రోడ్డు రిక్షా కాలనీలో నివాసం ఉంటున్న బాలు ఆటో డ్రైవర్ భార్య సుమతి. గత కొద్ది కాలంగా భార్య మీద అనుమానంతో ఇంట్లో గొడవలు జరుగుతుండగా, రాఖీ పండగ సందర్భంగా బంధువులు ఇంటికి వచ్చారు. నిన్న రాత్రి బాగానే ఉన్న సుమతి ఉదయం ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది, ఒంటినిండా రక్తపు గాయాలు ఉండడంవల్ల భర్త చంపి ఉరి వేసినట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, సుమతి తరపు కుటుంబ సభ్యులు తమకు అన్యాయం జరిగిందని పోలీసులుతో వాగ్వాదానికి దిగారు, తమకు న్యాయం చేయాలంటూ బోరుణ వినిపిస్తున్న బాధితులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page