పర్లపాడు హత్యాయత్నం కేసులో ముద్దాయికి రూ. 5,000 జరిమానా
- VOICE OF HERALD

- Aug 4
- 1 min read
పర్లపాడు హత్యాయత్నం కేసులో ముద్దాయికి రూ. 5,000 జరిమానా

వైయస్సార్ కడప జిల్లా
రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామంలో 2019లో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రొద్దుటూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి శ్రీమతి షేక్ ఫైజెన్నిసా విచారణ అనంతరం ముద్దాయి గంగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, 28, పై నేరం నిరూపణ కావడంతో రూ. 5,000 జరిమానా విధించారు.
రాజుపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం. 04/2019 U/S 307 IPC ప్రకారం, ఇంటి గోడ వివాదం కారణంగా 09.01.2019 ఉదయం 8:30 గంటలకు ముద్దాయి ఫిర్యాది దుద్యాల చంద్రమహేశ్వర్ రెడ్డి పై గొడ్డలితో దాడి చేసి తలపై గాయాలు చేశాడు. అప్పటి ఎస్సై ఎం. శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పి.పి సి. గుర్రప్ప, ప్రస్తుత ఎస్సై జి. ప్రణయ్ కుమార్ రెడ్డి, కోర్టు సిబ్బంది ఎన్. సంజీవ్ కుమార్, కె. వీరశేఖర్ లు సకాలంలో సహకరించినందుకు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ వారిని అభినందించారు.




Comments