top of page

గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 18
  • 1 min read

గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముగ్గులు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 60 వేల రూపాయలను మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు. పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన ప్రొద్దుటూరు అడిషనల్ ఏఎస్పీ విభూ కృష్ణ. ఈ సందర్భంగా ఏ ఎస్ పి విభూ కృష్ణ మాట్లాడుతూ, పోలీసుల దాడి సమయంలో మరో ముగ్గురు నిందితులు పరారీ అయ్యారు అని, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లాంటి అసంఘిక కార్యక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అరెస్టు అయిన ముగ్గురు నిందితులపై గతంలో 40కి పైగా వివిధ కేసులు నమోదైనట్లు ఏఎస్పి విభూ కృష్ణ తెలిపారు. ప్రజలు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page