top of page

మున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ వైస్ చైర్మన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 4
  • 1 min read

మున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ వైస్ చైర్మన్

ప్రొద్దుటూరు : మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపీ నాయకులు పాతకోట బంగారు మునిరెడ్డి మంగళవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు విషయంలో కమీషనర్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈ సందర్బంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరుగుతున్నా అవినీతి, అక్రమ కార్యకలాపాలు మీద దృష్టి సారించమని కమీషనర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మార్కెట్ గేటు వసూలు విషయంలో జరిగిన అక్రమాలుపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసారు. అనంతరం కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఆగష్టు 15 తేదీ నుండి మహోన్నత లక్ష్యంతో ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చి దిద్దడానికి ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని కమీషనర్ కోరారు. మాజీ వైస్ చైర్మన్ ఖాజా, మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, వైసీపీ నాయకులు గురునాథ్ రెడ్డి కమీషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page