top of page

వైఎస్సార్ కడప జిల్లా కూడో (Kudo) అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక – రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

Writer: VOICE OF HERALD
VOICE OF HERALD
Sep 26
1 min read

వైఎస్సార్ కడప జిల్లా కూడో (Kudo) అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక – రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

వైఎస్సార్ కడప జిల్లా కూడో అసోసియేషన్ (కుడి) ఆధ్వర్యంలో జిల్లా క్రీడా అధికారి మరియు ఆంధ్రప్రదేశ్ కూడో ఫెడరేషన్ పరిశీలకుల సమక్షంలో నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్క్లబ్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా రామేశ్వరం విద్యాసాగర్, ఉపాధ్యక్షుడిగా ఇల్లూరు పవన్ కుమార్, కార్యదర్శిగా లింగం సోలమన్ విశాల్, కోశాధికారిగా మంచాల సంపత్ సుకుమార్, సంయుక్త కార్యదర్శిగా గుటం కిరణ్ కుమార్ ఎన్నికయ్యారన్నారు. అలాగే కార్యనిర్వాహక సభ్యులుగా చిత్రాల పృథ్వీ కుమార్, జక్కల లక్ష్మీదేవి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడో అసోసియేషన్ అధ్యక్షుడు శశిధర్, రాష్ట్ర డైరెక్టర్ అనురాధ నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, జిల్లాలో క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లి యువతను ప్రోత్సహించాలని సూచించారు.


ఇటీవల పరవాడలోని జిల్లా క్రీడా వికాస కేంద్రం ఇండోర్ స్టేడియంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభమైన 6వ ఆంధ్రప్రదేశ్ కూడో టోర్నమెంట్‌లో వైఎస్సార్ కడప జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో కడప జిల్లాకు చెందిన ఆర్. సుశాంత్ సాగర్, ఎమ్. అభినవ్ ప్రణవ్, ఆర్. షర్మిల బంగారు పతకాలు సాధించగా, ఎమ్. జాసన్ సందేశ్ హోప్ వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు. పతకాలు సాధించిన ఈ క్రీడాకారులను జిల్లా అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించింది. కాగా, నేషనల్ ప్రెసిడెంట్ హన్షి మెహుల్ వోరా, హెడ్ కోచ్ జాస్మిన్ మక్వానా, సెమినార్ ఇన్‌ఛార్జ్ ప్రియాంక్ రాణా ఆధ్వర్యంలో పర్యవేక్షించబడిన ఈ పోటీల్లో రాణించిన విజేతలు, వచ్చే నవంబర్‌లో అహ్మదాబాద్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు (National Meet) ఎంపికయ్యారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page