top of page

సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 8, 2024
  • 1 min read

సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్

ఈ నెల 15న వైఎస్ వివేకా అయిదో వర్దంతి. అదే రోజున పులివెందుల వేదికగా రాజకీయ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యారు. వివేకా హత్య తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలు, ఇప్పుడు ఎన్నికల వేళ కొత్త రాజకీయ సమీకరణాలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే సునీత వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పైన వివేకా హత్య కేసులో పలు ఆరోపణలు చేసారు, ఎంపీ అవినాశ్ పైన న్యాయ పోరాటం చేస్తామన్నారు. తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలోనూ వచ్చే ఎన్నికల్లో తన సోదరులకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. వివేకా కుమార్తె వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page