జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్ - వైఎస్ జగన్ న్యూలుక్ వైరల్

జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్.. వైఎస్ జగన్ న్యూలుక్ వైరల్..



ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన పూరైంది. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలను వైఎస్ జగన్ విజయవాడ చేరుకోనున్నారు. మరోవైపు విదేశీ పర్యటనలో వైఎస్ జగన్ న్యూ లుక్లో కనిపించారు. జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ ధరించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ తెల్లచొక్కాతో కనిపించే వైఎస్ జగన్.. ఇలా న్యూలుక్లో కనిపించడంతో వైసీపీ శ్రేణులు ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ పూర్తైన వెంటనే వైఎస్ జగన్ కుటుంబసమేతంగా యూరోప్ పర్యటనకు వెళ్లారు. సుమారుగా 15 రోజుల పాటు జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మళ్లీ స్వదేశానికి రానున్నారు. విదేశీ పర్యటనను పూర్తిచేసుకుని.. శనివారం ఉదయానికి విజయవాడ చేరుకుంటారు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ దిగనున్నారు.







Comments