top of page

మద్యం మత్తులో యువకుడి వీరంగం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 11, 2022
  • 1 min read

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం


ఇబ్రహీంపట్నం మండలం, కోటికలపూడి గ్రామంలో యువకుడు మద్యం మత్తులో తన పిల్లలకు ఆశ్రయం ఇచ్చిందని పక్కింటి మహిళపై దాడి చేసాడు. తన ముందే కొడుకు పక్కింటి మహిళపై దాడి చేయటం సహించని తల్లి మద్యం మత్తులో ఉన్న కొడుకు పై తల్లి గొడ్డలితో దాడి చేసింది. దాడిలో గాయపడ్డ కొడుకు పరిస్థితి విషమంగా మారడంతో ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

అయితే గత కొంతకాలంగా భార్య విడాకులు ఇచ్చి ఇద్దరు ఆడపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. నిన్న శ్రీ రామ నవమి కావటంతో నానమ్మ ఇంటికి వచ్చిన పిల్లలు పకింటి మహిళ యింటిలో ఉండటం కోపం కట్టలు తెంచుకుంది. తల్లి నా మనవళ్లను మద్యం మత్తులో చంపుతాడేమో అని భయంతో ఆత్మ రక్షణ కోసమే కోట్టాను అని పోలీసుల విచారణ తల్లి తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page