top of page

కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించిన యువకుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 31, 2023
  • 1 min read

కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించిన యువకుడు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి స్నేహితుడి ఇంటికి వెళ్లిన సతీష్ అనే వ్యక్తి కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. ప్రొద్దుటూరు లోని బొల్లవరంలో నివాసం ఉంటున్న సతీష్ అనే వ్యక్తి గత నెల 19వ తేదీ కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అక్కడినుంచి ప్రొద్దుటూరులోని ఈశ్వర్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న స్నేహితుడు కిషోర్ ఇంటికి సతీష్ వెళ్ళాడు. కిషోర్ తల్లి కూడా గత నెల రోజుల నుంచి హైదరాబాదులోని బంధువుల ఇంటికి వెళ్లడంతో కిషోర్ ఇంట్లో సతీష్ ,కిషోర్ ఇద్దరే ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం కిషోర్ తల్లి హైదరాబాదు నుంచి వచ్చి ఇంట్లో చూడగా ఇంటినిండా దుర్వాసన రావడంతో కిషోర్ ను ఏమైంది అంటూ గట్టిగా తల్లి నిలదీసింది. తన స్నేహితుడు చనిపోయాడని శవాన్ని ఇంటిలోనే పూడ్చిపెట్టానంటూ కిషోర్ తల్లికి చెప్పడంతో కిషోర్ తల్లి జరిగిన విషమంతా ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులకు తెలియజేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిషోర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వైద్యనిచే సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. సతీష్ ను కిషోర్ హత్య చేశాడా... లేదా మరేవైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page