top of page

టిడిపి గూటికి ఎర్రగుడి చంద్రబాబు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 8, 2024
  • 1 min read

టిడిపి గూటికి ఎర్రగుడి చంద్రబాబు

వరద సమక్షంలో టిడిపిలో చేరుతున్న ఎర్రగుడి చంద్రబాబు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రగుడి చంద్రబాబు బుధవారం ఉదయం సంజీవ్ నగర్ లోని ఆయన నివాసం వద్ద ప్రొద్దుటూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో టిడిపి గూటికి చేరారు. గోపవరం పంచాయతీ నక్కలదిన్నె డేనియల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరుగుగా, 7, 8వ మున్సిపల్ వార్డులకు చెందిన దాదాపు 150 కుటుంబాలు టిడిపి కండువా కప్పుకున్నాయి, వీరందరికీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వరద నాయకత్వాన్ని బలపరుస్తూ రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో క్రియాశీలక టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ఘంటసాల వెంకటేశ్వర్లు, ఈవి సుధాకర్ రెడ్డి, పగిడాల దస్తగిరి, లింగాపురం సుబ్బారెడ్డి చల్లా రాజగోపాల్ యాదవ్ పాల్గొనగా, టిడిపిలో చేరిన వారిలో రాములమ్మ, ఎర్రగుడి చంద్రశేఖర్, అంకన్న, సంజీవ రాయుడు, ఆఫ్రిన్, వెంకటసుబ్బయ్య, అంజనమ్మ, పెద్దక్క, బుజ్జమ్మ, ఆశ, అబ్దుల్, ఖాదర్, బీబీ, హుస్సేన్ పీరా, వెంకటేశమ్మ, బుష్, నారప్ప, సుబ్బమ్మ, సురేష్, నరసింహ, నరసింహ శెట్టి, వంశీ, సందీప్, వెంకట శ్రీను, మేరీ, శ్రీనివాసులు, లక్ష్మీదేవి, మౌనిక, నజీర్, ఆంజనేయులు, నరసమ్మ, వెంకటసుబ్బమ్మ, బాలసుబ్బమ్మ, ప్రభావతి, రాజు తదితరులు ఉన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page